'అంటే సుందరానికి' ప్రీ రిలీజ్ బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా రేపు అనగా జూన్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ తో అందాల ముద్దుగుమ్మ నజ్రియా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకు మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా లాంటి మంచి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు.


శ్యామ్ సింగరాయ్ సినిమా తర్వాత నాని నటించిన సినిమా కావడం , ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇవ్వడం,  మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి మంచి విజయవంతమైన సినిమాల తర్వాత వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం,  ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించడం ఇలా అనేక కారణాల వల్ల ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లు గానే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే సుందరానికి మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.


నైజాం : 10 కోట్లు .
సీడెడ్ : 4 కోట్లు .
ఆంధ్ర : 10 కోట్లు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అంటే సుందరానికి మూవీ 24 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2.50 కోట్లు .
ఓవర్ సీస్ లో 3.50 కోట్లు .
ప్రపంచవ్యాప్తంగా అంటే సుందరానికి మూవీ 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.
అంటే సుందరానికి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గాని రావాలి అంటే 31 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించవలసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: