మహేష్ తో మరోసారి నటించబోతున్న ఆ ముద్దుగుమ్మ..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. భరత్ అనే నేను సినిమా దగ్గర నుండి మొదలు పెడితే మహర్షి , సరిలేరు నీకెవ్వరు తాజాగా వచ్చిన సర్కారు వారి పాట ఇలా నాలుగు సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు.


ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నారు.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించే ముద్దుగుమ్మ గురించి మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మొదట్లో ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. దాదాపు ఈ ముద్దుగుమ్మ కన్ఫామ్ అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ ముద్దుగుమ్మను ఈ సినిమా నుండి తప్పించినట్లు తెలుస్తోంది. దానితో ప్రియాంక అరుల్ మోహన్ ను మహేష్ బాబు సరసన హీరోయిన్ గా తీసుకున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇప్పటివరకు వెలువడలేదు.


తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతోంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది వరకే మహేష్ బాబు, రష్మిక మందన కాంబినేషన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అలాగే వీరిద్దరి కెమిస్ట్రీ కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది. దానితో మరొకసారి రష్మిక మందన ను మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: