ఫాహాద్ తో కలిసి తెలుగులో నటించాలని ఉంది... నజ్రియా..!

Pulgam Srinivas
నజ్రియా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అట్లీ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన రాజా రాణి మూవీ తో నజ్రియా అటు తమిళ ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. నజ్రియా కు తమిళ్ తో పాటు మలయాళంలో కూడా ఫుల్ క్రేజ్ వుంది.


అలాగే మలయాళంలో నజ్రియా అనేక సినిమాల్లో నటించింది.  ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు మలయాళ, తమిళ సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. అంటే సుందరానికి మూవీ జూన్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో నజ్రియా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది . అందులో భాగంగా అనేక విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూలో నజ్రియా మాట్లాడుతూ ... మలయాళంలో నా భర్త ఫహాద్ ఫాజిల్ నేను కలిసి నటించాను.  తెలుగులో కూడా నేను నా భర్త ఫహాద్ ఫాజిల్ తో కలిసి నటించాలని ఉంది.


మంచి కథ దొరికినట్లు అయితే కచ్చితంగా చేస్తాను అని తాజా ఇంటర్వ్యూలో నజ్రియా చెప్పుకొచ్చింది. అలాగే నజ్రియా సినిమా సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటూ ఉంటుంది. ఆ విషయం గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ... మంచి కథల కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను.  అందువల్లనే నా సినిమాలకు మధ్య టైమ్ చాలా ఎక్కువగా ఉంటుంది అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: