బాలయ్య కి తగ్గ టైటిల్ దొరికిందా..!!
అంతకు ముందు అయన పెద్దగా విజయాలు లేకపోయినా ఈ సినిమా ఆయనకు ఎనలేని జోష్ ని తెచ్చిపెట్టింది. అలా ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్పీడ్ పెంచేస్తు తన రేంజ్ ఇంకా ఇంకా పెంచుకుంటున్నారు. బోయపాటితో కలిసి చేసి ఈ అఖండ సినిమా వారికి కాంబో కి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అప్పటినుంచి వరుస మాస్ దర్శకులతో సినిమాలు ఒప్పుకుంటున్నాడు బాలకృష్ణ. ఇదే ఊపులో గోపిచంద్ మలినేని లాంటి భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు చేసే దర్శకుడితో కలిసి బాలకృష్ణ ఓ మాస్ సినిమా లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది.
ఇక ఈ సినిమా తర్వాత ఎఫ్ 3 డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమాకి సన్నాహకాల్లో ఉన్నారు బాలకృష్ణ. ఇప్పటికే కథ వినిపించగా త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. గోపీచంద్ మలినేని సినిమాను జులై లో పూర్తి చేసి సెప్టెంబర్ నుండి అనిల్ రావిపూడి సినిమా యొక్క చిత్రీకరణ ప్రారంభించనున్నారని తెలుస్తుంది. కేవలం నాలుగు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమా ను విడుదల చేయాలన్నది అనిల్ ఆలోచన. ఈ సినిమా కి `బ్రో ఐ డోంట్ కేర్` అనేది టైటిల్ గా పెట్టబోతున్నారట. ఇది బాలకృష్ణ మాస్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోయే ఆలోచన అంటున్నారు.