వెంకీ ఆయనతో సినిమా కి ఒకే చెప్పాడా..!!

P.Nishanth Kumar
వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు విక్టరీ వెంకటేష్. సినిమా విడుదల జరిగే ప్లేస్ ఏది అయిన కూడా వెంకటేష్ హిట్ అందుకుంటూ ముందుకు పోతున్నాడు. ఆమధ్య ఓటీటీ లో విడుదల చేసిన నారప్ప సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. అందరు కూడా ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేస్తే బాగుంటుంది అని వాపోయారు. కానీ అప్పటి పరిస్థితుల మధ్య వెంకటేష్ ఈ సినిమా ను ఓటీటీ లో విడుదల చేయలేక తప్పలేదు.

తాజాగా వెంకటేష్ ఎఫ్ 3 సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న విధంగానే ఈ స్థాయి లో విజయం సాధించడం విశేషం. ఈ సినిమా లో మరో హీరో గా వరుణ్ తేజ్ నటించగా వీరికి జోడీగా తమన్నా మరియు మెహరీన్ లు నటించారు. అయితే వెంకటేష్ నటించబోయే తదుపరి సినిమా గురించి ఆయన ఇంకా చెప్పక పోవడం ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది.

నెట్ ఫ్లిక్స్ లో వెంకటేష్ చేసిన రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఈ మధ్యే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ కాకుండా సినిమా అప్డేట్ ఇవ్వకపోవడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు ప్రవీణ్ సత్తారు తో కలిసి కూడా ఆయన ఓ సినిమా చేయబోతున్నారట. ఇతర సీనియర్ హీరో లు వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో క్రేజీ డైరెక్టర్ లతో ముందుకు వెళ్తుంటే ఈ హీరో మాత్రం మెల్లమెల్లగా ముందుకు వెళ్లడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: