'అంటే సుందరానికి' మూవీ 'ఓటిటి' రిలీజ్ ఇప్పట్లో లేదు..!

Pulgam Srinivas
ప్రస్తుతం జనాలు 'ఓ టి టి' లలో సినిమాలను చూడడానికి ఏ రేంజ్ లో ఆసక్తి చూపిస్తూ వస్తున్నారో మన అందరికీ తెలిసిందే. దేశంలోకి కారోనా ఎంటర్ కాకముందు సినీ ప్రేమికులు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో సినిమాలను ఎక్కువగా చూసే వారు కాదు. కానీ అప్పుడు అయితే దేశం లోకి కారోనా ఎంటర్ అయ్యిందో థియేటర్ లపై ప్రభుత్వాలు ఆంక్షలను విధించడం మొదలుపెట్టాయి.


అలాగే కొంత కాలం పాటు థియేటర్లను పూర్తిగా కూడా మూసి వేసాయి. దానితో సినీ ప్రేమికులకు 'ఓ టి టి' లే దిక్కుగా మారాయి. అలా ఎంతో మంది సినీ ప్రేమికులు 'ఓ టి టి' లకు అలవాటు పడిపోయారు. దానితో కొంత మంది థియేటర్ లోకి వెళ్లి సినిమా చూడకుండా మూవీ ఎప్పుడు 'ఓ టి టి' లోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండిపోతున్నారు. ఇది ఇలా ఉంటే అలా సినిమా థియేటర్ లో చూడడం కంటే 'ఓ టి టి' లో చూడటానికి సినీ ప్రేమికులు ఆసక్తి చూపిస్తూ రావడంతో సినిమాలకు థియేటర్ లలో వచ్చే కలెక్షన్లు కూడా తగ్గిపోతున్నాయి. దానితో ప్రేక్షకులను సినిమా థియేటర్లను రప్పించడానికి  చిత్ర బృందాలు పలు పబ్లిసిటీ లను కూడా చేస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా విడుదలైన ఎఫ్ 3 మూవీ చిత్ర బృందం తమ సినిమా 'ఓ టి టి' లోకి వస్తుంది , కాకపోతే అది మాత్రం ఎనిమిది వారాల తరువాత అని చెప్పేశారు. దానితో అన్ని వారాలు వెయిట్ చేయలేని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమా చూసే అవకాశం ఉంది. అయితే తాజాగా  నాని హీరోగా  నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంటీ సుందరానికి మూవీ ఈ రోజు అనగా జూన్ 10 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.


ఈ సినిమా 'ఓ టి టి' విడుదల గురించి ఈ సినిమా ప్రొడ్యూసర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అంటే సుందరానికి మూవీ ప్రొడ్యూసర్ అంటే సుందరానికి మూవీ 'ఓ టి టి' స్ట్రీమింగ్ హక్కులను నేట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. కాకపోతే ఇప్పట్లో అంటే సుందరానికి మూవీ 'ఓ టి టి' లో రాదు. ఈ సినిమాను థియేటర్ లలో  చూసి ఎంజాయ్ చేయండి. అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇలా అంటే సుందరానికి మూవీ ఇప్పట్లో 'ఓ టి టి' లోకి రాదు అని ప్రొడ్యూసర్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: