మరోసారి పవన్ కళ్యాణ్ ఆ ఆడిషన్ తీసుకోబోతున్నాడా..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత కొంత కాలం పాటు సినిమా లకు దూరంగా ఉండి, కేవలం రాజకీయాల పైన పూర్తి దృష్టి పెట్టాడు.


అయితే ఆ తర్వాత మళ్లీ అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వకీల్ సబ్ , భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ లుగా నిలిచాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అలాగే మరో రెండు రీమేక్ సినిమా లకు,  అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు .


అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి అవగానే తాను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను ప్రారంభించ నున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను ముగించిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు కొంత కాలం గ్యాప్ ఇచ్చి కేవలం రాజకీయాల వైపు దృష్టి పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: