బాలయ్యా మజాకా.. అలా చేస్తాడని ఎవరు అనుకోలేదట?

praveen
నందమూరి బాలకృష్ణ ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో హీరోగా నటించారుమ్ ఇలా బాలకృష్ణ నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికి కూడా చిత్ర పరిశ్రమలో ఎవర్గ్రీన్ గానే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ గా మిగిలిపోయిన సినిమాల్లో బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో వచ్చిన భైరవద్వీపం సినిమా కూడా ఒకటి. కాగా ఈ సినిమాలో మొదటి లవర్ బాయ్ గా కనిపించిన బాలకృష్ణ ఆ తర్వాత మాత్రం కురుపీ లా మారిపోతాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే తమ అభిమాన హీరో బాలయ్యను ఒక్కసారిగా ఆ రూపంలో చూసి అభిమానులు షాక్ లో మునిగి పోయారట. అంతేకాదు ఇక బాలకృష్ణ ఆ పాత్ర చేస్తారని అభిమానులు ఎవరూ ఊహించలేదట. అప్పట్లో ఎంతో మంది అభిమానులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. భైరవద్వీపం సినిమా లో లవర్ బాయ్ లా కనిపించే పాత్రతో పాటు కురుపీ  పాత్ర ఉంటుందని తెలిసి కూడా బాలయ్య సినిమాకు అంగీకరించడం సాహసం లాంటిదే అని అప్పట్లో విశ్లేషకులు సైతం బాలయ్య పై ప్రశంసలు కురిపించారు.


 అయితే ప్రతి హీరో కూడా కొత్త పాత్రలను ఎంతో సవాల్ గా తీసుకుంటారు. ఇక బాలకృష్ణ అప్పట్లో భైరవ ద్వీపం లో కురుపీ పాత్రను కూడా ఇలాగే సవాల్ గా తీసుకున్నారట. జానపద చిత్రాలకు తక్కువ ఆస్కారమున్న ఆ రోజుల్లో ఎక్కడ తేడా కొట్టిన సినిమా ఫ్లాప్ అవ్వడం తప్పదు. అయితే కురూపి పాత్ర కోసం బాలయ్యకు మేకప్ చేయడానికి రెండు గంటల సమయం పట్టేదట. బాలయ్య ఏమైనా తినాలంటే మేకప్ మొత్తం తీసిన తర్వాత తినేందుకు అవకాశం ఉండేదట. దీంతో ఆయన భోజనానికి దూరంగా ఉంటూ ఇక జ్యూస్ లు మాత్రమే తాగుతూ ఉండేవారట. అంతేకాదు తన తల్లి శాపం స్వీకరిస్తుందని తెలిసి బాలయ్య కొండలపై పరిగెడుతూ ఉంటే దెబ్బలు కూడా తాకాయట.  ఇలా బాలయ్య కురుపీ పాత్రకోసం పెద్ద సాహసమే చేశాడు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: