దాదాపు ఏడు సంవత్సరాల నుండి ప్రేమ లో ఉన్నటువంటి నయనతార డైరెక్టర్ విఘ్నేష్ ఎట్టకేలకు జూన్ 9వ తేదీన మహాబలిపురంలో ఒక రెస్టారెంట్ లో వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఈ విధంగా వీరి వివాహంతో వీరి జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం పర్యవేక్షణలో వీరి వివాహం చాలా గ్రాండ్ గా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో జరిగింది. ఇకపోతే నయనతార వివాహంలో చూడటానికి చాలా అందంగా కనిపిస్తోంది అని చెప్పవచ్చు.
ఎరుపు రంగు డిజైన్స్ శారీ లో ఎంతో అందంగా ఉన్నటువంటి నయనతార తన వివాహానికి సంబంధించి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే పెళ్లి ఫోటోలు లో నయనతార ధరించిన నగల గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతోంది నయనతార ధరించిన నగలు విలువ ఎంత ఉంటుంది అనే విషయం పెద్ద ఎత్తున నెటిజన్లలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే పెళ్లి కోసం నయనతార ధరించిన నగలు అన్నీ కూడా తన భర్త విఘ్నేష్ తనకు కానుకగా ఇచ్చినట్లుగా సమాచారం. ఈమె ధరించిన నగలు సుమారుగా రూ.4 కోట్ల రూపాయల పైగా విలువ చేస్తాయనే సమాచారం.
అదేవిధంగా నయనతార విగ్నేష్ కానుకగా డైమండ్ రింగ్ ఇచ్చింది దీనిలో దాదాపుగా రూ .2 కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా నయనతార పెళ్లి లో ధరించిన నగలు సుమారుగా అన్ని కలుపుకుంటే రూ.7 కోటి రూపాయల విలువ ఉంటుందట మొత్తానికి నయనతార
విఘ్నేష్ పెళ్లి బంధం తో ఒకటి కావడంతో ఎంతో మంది అభిమానులు సైతం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు అభిమానులు సైతం. అయితే నయనతార వివాహం అయిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పబోతోంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం తెలియాల్సి ఉంది.