టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న రష్మిక మందన గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు సాధించడంతో ప్రస్తుతం రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది .
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక మందన కొన్ని రోజుల క్రితం విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది . ఇలా పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న రష్మిక మందన కు ప్రస్తుతం అనేక బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలను దక్కుతున్నాయి . ఇది ఇలా ఉంటే రష్మిక మందన ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాతో మోస్ట్ క్రేజీ దర్శకుడిగా మారిపోయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా విషయాలను పంచుకున్న రష్మిక మందన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది .
అందులో భాగంగా రన్వీర్ కపూర్ మంచి వ్యక్తి అని , కాకపోతే ఆయనను మొదటి సారి కలిసినప్పుడు చాలా నెర్వస్ గా అనిపించింది అని, కాకపోతే ఐదు నిమిషాల్లోనే ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది అని రష్మిక మందన చెప్పుకొచ్చింది. యానిమల్ సినిమాతో పాటు రష్మిక మందన తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ హ నటిస్తోంది.