పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి..అప్పడేనట..!

Satvika
తెలుగు చిత్ర పరిశ్రమ లో ఒక హీరోయిన్ కు పెళ్ళి అయితే ,ఆ తర్వాత వరుస లో  ఉన్న హీరోయిన్ పై పడుతుంది. మొన్నటి వరకూ నయనతార పేరు ఎక్కువగా వినిపించింది.. ఇప్పుడు ఆమెకు పెళ్ళి కావడంతో ఇప్పుడు వేరే హీరోయిన్ పై అందరి ఫోకస్ పడింది.. ఫిదా' చిత్రం తో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి, ఆ సినిమా తోనే ప్రేక్షకుల ను ఆకట్టుకోవడం లో సక్సెస్ అయ్యింది..ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం తో, ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది ఈ బ్యూటీ

అయితే గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ ప్రేక్షకుల ను మెప్పిస్తూ వస్తుంది.. కేవలం పర్ఫార్మెన్స్‌ తో కూడా స్టార్‌డమ్ తెచ్చుకోవచ్చని ఈ బ్యూటీ ప్రూవ్ చేసి అందరిచేత వావ్ అనిపించింది. అయితే తాజాగా ఈ అమ్మడు తన అభిమాను లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్‌ లో భాగంగా ఏర్పాటు చేసిన చేశారు.. ఈ సందర్భంగా ఈ ఆమె ఇంటర్వ్యూ కు హాజరైంది..



తాను పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది ఈ అందాల బ్యూటీ. అంతేగాక.. ఇద్దరు పిల్లల్ని కూడా కనాలని ఉందంటూ తన మనసులోని మాటను చెప్పేసింది. అయితే తాను ఇంట్లో ఎక్కువగా తెలుగు మాట్లాడుతుండటం తో, తన కుటుంబసభ్యులు ఓ మంచి తెలుగు అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోవాలంటూ సూచిస్తున్నారట. ఈ వార్త తో ఒక్కసారిగా సాయి పల్లవి అభిమానుల కు షాక్ తగిలినట్లయ్యింది. మరి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరా అని ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం సినిమాల పై మాత్రమె ఫోకస్ పెట్టింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: