మెగా బాస్ కి కోపం వచ్చిందా..?
ఈ షోకి జడ్జులుగా తమన్, నిత్యా మీనన్, కార్తీక్ వ్యవహరిస్తుండగా హోస్ట్ గా ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరాం చంద్ర చేస్తున్నారు. ఈమధ్యనే బిగ్ బాస్ నుండి వచ్చిన శ్రీరాం చంద్ర ఆ క్రేజ్ తో తెలుగు ఇండియన్ ఐడల్ హోస్ట్ గా కూడా చేస్తున్నాడు. ఇక ఆరుగురు టాప్ సింగర్స్ తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో ఫైనల్స్ కు చేరింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలో స్టేజ్ మీద హోస్ట్ చేసిన జాప్యానికి చిరుకి కోపం వచ్చిందని టాక్.
స్టేజ్ మీద చిరు ఉండగానే స్పాన్సర్స్ అందరిని చెప్పారట. ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు రిపీట్ అయ్యిందట. గెస్ట్ లు ఉన్నప్పుడు ఎక్కువగా టైం వేస్ట్ చేయరు. ఆ స్పాన్సర్స్ గురించి చెప్పాలంటే గెస్టులు రాక ముందో లేక వెళ్లాకనో చూసుకోవాలి. కానీ చిరు స్టేజ్ మీద ఉండగానే స్పాన్సర్స్ గురించి చెబుతూ చాలా టైం వేస్ట్ చేశారట. దీనితో చిరంజీవికి కోపం వచ్చిందని. షో నుంచి వాకౌట్ చేశారని టాక్. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మాములుగా అయితే చిరంజీవి ఎప్పుడూ పబ్లిక్ లో కోప్పడ్డది లేదు. మరి అలాంటి చిరంజీవి కూడా అసహనం వ్యక్తం చేశాడంటే షో నిర్వాహకుల పనితీరుని తప్పుబట్టాల్సిందే.