వామ్మో : సాయి పల్లవి ఏంటి అంత డేర్ .... ??

GVK Writings
టాలీవుడ్ సినిమా పరిశ్రమకి శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు యువ భామ సాయి పల్లవి. అందులో హైబ్రిడ్ పిల్ల భానుమతి అనే పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకున్న సాయి పల్లవి, దానితో పెద్ద సక్సెస్ కొట్టారు. అనంతరం నానితో కలిసి ఆమె చేసిన ఎంసిఏ మూవీ కూడా మంచి విజయం సొంతం చేసుకుని హీరోయిన్ గా ఆమెకు మరింత మంచి పేరు తెచిపెట్టింది.

ఇక అక్కడి నుండి అటు తెలుగుతో పాటు మలయాళ, తమిళ్ లో కూడా మరింతగా అవకాశాలతో దూసుకెళ్లిన సాయి పల్లవి ఇటీవల నాగ చైతన్యతో లవ్ స్టోరీ, నానితో శ్యామ్ సింగ రాయ్ మూవీస్ తో మరొక  రెండు విజయాలు సొంతం చేసుకున్నారు. ఇక లేటెస్ట్ గా ఆమె చేస్తున్న సినిమా విరాట పర్వం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగముగా తన లైఫ్, కెరీర్ గురించి పలు విషయాలు వెల్లడించారు సాయి పల్లవి. తనకి డ్యాన్స్ అంటే ఇష్టం అని, అప్పట్లో ఒక ప్రముఖ ఛానెల్ లో డ్యాన్స్ గా పోటీ చేసి మంచి పేరు దక్కించుకున్న అనంతరం తనకు సినిమా అవకాశాలు రావడం జరిగిందని అన్నారు.

ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ, ఇప్పటివరకు తనవద్దకు వచ్చినా పలు సినిమాల పాత్రలు పూర్తిగా తనకు నచ్చితేనే చేసానని, ఒకింత ఎక్కువగా ఎక్స్ పోజింగ్ కి తావిచ్చేవి, అలానే తనకు పెద్దగా ప్రాధాన్యత లేదనుకున్న పాత్రలు కూడా తాను చేయలేదని అన్నారు. మధ్యలో అక్కడక్కడా పలు బడా సినిమాల ఛాన్స్ లు వచినప్పటికీ కూడా తాను అందుకే చేయలేదని, ఈ విషయంలో మాత్రం తాను ఎప్పటికీ ఇలానే వ్యవహరిస్తానని అన్నారు సాయి పల్లవి. మొత్తానికి ఆడ పులిలా స్క్రీన్ పై తన ముచ్చటైన యాక్టింగ్ తో అందరినీ తో ఆకట్టుకునే సాయి పల్లవి రియల్ లైఫ్ లో ఇంత డేరింగ్ గా అలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: