నేషనల్
క్రష్ రష్మీక మందన గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక మంది
టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్
హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది . ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు క్రేజీ
మూవీ అవకాశాలు కూడా దక్కుతున్నాయి .
అందులో భాగంగా ప్రస్తుతం
రష్మిక మందన
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు ఆయన తళపతి
విజయ్ హీరోగా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో
హీరోయిన్ గా నటిస్తోంది . ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది . ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ ఒక షెడ్యూల్ విజయ వంతంగా పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజు ల్లోనే ఈ
మూవీ తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది . ఈ
సినిమా మొత్తం షూటింగ్ ని శర వేగంగా పూర్తి చేయాలి అని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న
రష్మిక మందన,
విజయ్ హీరోగా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
తాజా ఇంటర్వ్యూలో రష్మీక మందన మాట్లాడుతూ... తలపతి
విజయ్ హీరోగా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ లో నేను సెల్ఫిష్ మరియు తల పొగరు అమ్మాయిల కనిపించబోతున్నాను. విజయ్ కు తనకు మధ్య వచ్చే సన్నివేశాలలో తాను తల పొగరు ఎక్కువగా చూపించబోతున్నట్లు
రష్మిక మందన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.