కొత్త కండీషన్ల తో హడల్ పుట్టిస్తున్న కొత్త పెళ్ళి కూతురు..!

Satvika
కొంత హీరోయిన్లు పెళ్ళి అవ్వగానే కొన్నింటిని తప్పక మార్చుకుంటారు..ఉదాహరణకు సమంత.. పెళ్ళయిన తర్వాత పద్దతి కలిగిన సినిమాలను మాత్రమే చేసింది..ఆ తర్వాత విడి పోయిన తర్వాత మళ్ళీ అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి ముద్దుగుమ్మ నయన్ కూడా చేరింది.నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన నయనతార తన అందం అభినయంతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.


మొదటి లో గ్లామర్ పాత్రలను పోషించిన నయనతార గత కొంత కాలంగా నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ పాత్రలో మాత్రమే నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. నయనతార సినిమాల విషయంలోనే కాకుండా తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది.నయనతార మొదట హీరో శింబుతో ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించాయి. తర్వాత ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో పడి పెళ్ళి చేసుకునే దాకా వెళ్ళారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి పెళ్ళి ఆగిపోయింది. అయితే ప్రభుదేవాతో ప్రేమలో పడిన నయనతార మీద ప్రభుదేవా భార్య ఇప్పటికీ ఫైర్ అవుతూ ఉంటుంది.


ఇదిలా ఉండగా తాజాగా నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. నాలుగేళ్లుగా వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ రిలేషన్ లో ఉన్నారు. మూడు రోజుల క్రితం సినీ ప్రముఖులు , బంధు మిత్రుల ఆధ్వర్యంలో వీరిద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇప్పుడు నిర్మాతలకు కొత్త షరతులు పెట్టినట్లు తెలుస్తుంది.విగ్నేష్ శివన్ తో రిలేషన్ లో ఉన్న సమయంలోనే నయనతార గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ లేడి ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు వివాహం జరిగిన తర్వాత కూడా తను సినిమాకి సైన్ చేయాలంటే ఎటువంటి రొమాంటిక్ సీన్స్, గ్లామరస్ సీన్స్ ఉండకూడదు అని దర్శకులకి కొత్త కండిషన్ పెట్టింది. అంతే కాకుండా కుటుంబంతో గడపటానికి ఒక సినిమా పూర్తి అయిన తరువాత మాత్రమే ఇంకో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..మరి ఈమెకు మార్కెట్ మంచి డిమాండ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.. నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: