అంటే సుందరానికి సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
నజ్రియా నాజిమ్‌తో నాని కెమిస్ట్రీ కూడా సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్‌ను చూపిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులు పూర్తయ్యేసరికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ను వసూలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.14.95 కోట్ల షేర్ వసూళ్లు సాధించి నాని కెరీర్‌లో మరో హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..వివేక్ ఆత్రెయ సంగీతాన్ని అందించారు..
సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేయగా, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.30 కోట్లకు అమ్ముడయ్యాయి..సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 4.54 కోట్లు
సీడెడ్ – 1.07 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.15 కోట్లు
ఈస్ట్ – 0.84 కోట్లు
వెస్ట్ – 0.73 కోట్లు
గుంటూరు – 0.80 కోట్లు
కృష్ణా – 0.74 కోట్లు
నెల్లూరు – 0.53 కోట్లు
ఏపీ మరియు తెలంగాణాలో కలిపి 10.40 కోట్లు..
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 1 కోట్లు
ఓవర్సీస్ – 3.55 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ – రూ.14.95 కోట్లు..