టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరైన గోపీచంద్ పోయిన సంవత్సరం విడుదల అయిన సిటీ మర్
మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.
సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సిటిమార్
సినిమా కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కింది. మహిళా కబడ్డీ కోచ్ గా ఈ సినిమాలో నటించిన గోపీచంద్ తన నటనతో ప్రేక్షకులను అలరించాడు.
వరుస అపజయాలతో బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయిన గోపీ చంద్ 'సిటిమార్'
మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇలా సీటీ మార్ లాంటి పవర్ ఫుల్
మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్
మూవీ తో అదిరిపోయే
సక్సెస్ ను అందుకొని ఫుల్
జోష్ లో ఉన్న గోపీ చంద్ తాజాగా పక్కా కమర్షియల్
మూవీ లో హీరోగా నటించాడు.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
మూవీ లో
రాశి కన్నా కథానాయికగా నటించింది. ఈ
మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ యు
వి క్రియేషన్స్ నిర్మించింది. ఈ
మూవీ ని జులై 1 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా పక్కా కమర్షియల్ చిత్ర బృందం ఈ
సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది.
పక్కా కమర్షియల్
మూవీ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ
మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. పక్కా కమర్షియల్
సినిమా ట్రైలర్ 24 గంటల్లో 5.72 మిలియన్ వ్యూస్ ను , 143 కే లైక్ లను సాధించింది. ఇలా పక్కా కమర్షియల్
మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. మరి పక్కా కమర్షియల్
మూవీ తో గోపీచంద్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.