శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.O
మూవీ తో మరోసారి
సూపర్ స్టార్ రజినీకాంత్ పాన్
ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాడు అని ఎంతో మంది రజనీకాంత్ అభిమానులు ఆశించారు. కాకపోతే ఆ
సినిమా ఆశించిన రేంజ్ లో ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా రజనీకాంత్ 'అన్నాత్తే' సినిమాలో హీరోగా నటించాడు. ఈ
సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఇలా వరుస అపజయాలను బాక్సాఫీస్ దగ్గర ఎదుర్కొంటున్న
రజినీ కాంత్ మరి కొన్ని రోజుల్లో
తమిళ క్రేజీ దర్శకుడు ఆయన నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన రోబో
మూవీ తర్వాత మరో సారి
ఐశ్వర్య రాయ్
హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు
రజినీ కాంత్ స్వయంగా కథను రాసుకున్నట్లు, ఆ కథకు కె ఎస్
రవికుమార్ స్క్రీన్ ప్లే ను అందించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ
మూవీ లో
శివ కార్తికేయన్ కూడా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రజనీ కాంత్ , నెల్సన్
దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ కి చిత్ర బృందం ఒక క్రేజీ టైటిల్ ఫిక్స్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. రజనీ కాంత్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు 'బాస్' అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.