టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరైన వివేకా
ఆత్రేయ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకుడు
వివేక్ ఆత్రేయ , శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన
మెంటల్ మదిలో మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టాడు.
మొదటి
సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని అటు ప్రేక్షకుల నుండి , ఇటు విమర్శకుల నుండి
వివేక్ ఆత్రేయ మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఆ తర్వాత మరొక సారి శ్రీ విష్ణు హీరోగా
బ్రోచేవారెవరురా అనే సినిమాను వివేక్
ఆత్రేయ తెరకెక్కించాడు. ఈ
సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది . ఇలా రెండు వరుస విజయాల తర్వాత
వివేక్ ఆత్రేయ తాజాగా
నాని హీరోగా నజ్రియా
హీరోయిన్ గా
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ లో అంటే సుందరానికి
మూవీ ని తెరకెక్కించాడు. ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా
జూన్ 10 వ తేదీన విడుదల అయ్యింది. తాజాగా అంటే సుందరానికి
మూవీ చిత్ర బృందం 'సుందరమ్స్ సెలబ్రేషన్స్' పేరుతో
ఈవెంట్ ను నిర్వహించింది.
ఈ
ఈవెంట్ లో భాగంగా దర్శకుడు
వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ... అంటే సుందరానికి
మూవీ లో ఫస్ట్ ఆఫ్ స్లో గా ఉందని అంటున్నారు.
హీరో హీరోయిన్ లను చిన్నప్పటి నుంచి చెబుతూ రావడం వలన అలా అనిపించి ఉంటుంది అని
వివేక్ ఆత్రేయ చెప్పుకొచ్చాడు.
మూవీ సెకండాఫ్ ను స్పీడ్ గా తీసిన నాకు ఫస్టాఫ్ స్పీడ్ గా ఉండాలని తెలియదా... సెకండాఫ్ కనెక్ట్ కావాలి అంటే ఫస్టాఫ్ అలా ఉండాల్సిందే. అని తాజాగా
వివేక్ ఆత్రేయ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే అంటే సుందరానికి
మూవీ ప్రస్తుతం విజయవంతంగా
థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.