మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఇటు క్లాస్ , అటు మాస్ రెండు రకాల జోనర్ సినిమా లలో నటిస్తూ రెండు రకాల జోనర్ లలో కూడా మంచి విజయాలను అందుకొని సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ను ముందుకు సాగించాడు.
అలా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే సాయి ధరమ్ తేజ్ కు అనుకోకుండా యాక్సిడెంట్ కావడం వల్ల కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. యాక్సిడెంట్ కారణంగా కొంత కాలం పాటు మూవీ లకు దూరంగా ఉన్న సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకొని తిరిగి సినిమా షూటింగ్ లలో కూడా పాల్గొంటున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తన కెరియర్ లో 15 వ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గా తెరకెక్కుతోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ 30 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ మూవీ తో అటు ప్రేక్షకుల నుండి, ఇటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.