ఒకే ఒక్క కారణంతో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేసిన చైతూ..?
భలే భలే మగాడివోయ్:
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ఇది . అయితే నిజానికి ఈ సినిమా కధ మొదట నాగ చైతన్య దగ్గరకు వెళ్లిందట . అయితే మన చైతన్య మతిమరుపు ఉన్న అబ్బాయిగా అంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకోని భలే భలే మగాడివోయ్ రిజెక్ట్ చేసినట్టు సమాచారం. అంతేకాదు సీన్ కట్ చేస్తే నాని నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
కొత్త బంగారులోకం:
వరుణ్ సందేశ్ హీరో గా నటించిన సినిమా ఇది.ఇక ఈ సినిమా ఎన్ని రికార్డులు తిరగ రాసిందో మనకు తెలిసిందే. ఇకపోతే వరుణ్ కెరీర్ లో హ్యాపీ డేస్ కన్నా సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ఇదే అని చెప్పొచ్చు.అయితే ఈ సినిమా కధ ఫస్ట్ చైతన్య కు చెప్పితే..ఆయన కాలేజీ కుర్రాడి గెటప్ లో ఆయన సెట్ అవ్వరని చెప్పి రిజెక్ట్ చేశారట.ఇక అలా ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు చైతన్య.
అఆ:
నితిన్-సమంత నటించిన సూపర్ హిట్ సినిమా అ ఆ .అయితే ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సమంత అల్లరి..నితిన్ బాధ్యత..మూడు సినిమాను మరో స్దాయిలో నిలబెట్టాయి.ఇకపోతే ఈ సినిమా మొదట నాగచైతన్య వద్దకే వచ్చింది.కానీ అప్పట్లో వేరే సినిమాతో బిజీ గా ఉన్నాడు చైతన్య....కాగా కాల్ షీట్ అడ్జెస్ట్ చేయలేక ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. ఇక దాంతో ఈ సినిమా నితిన్ కు వెళ్ళింది.
అయితే అలా మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను వదుకునేశాడు చైతన్య. ఇక ఈ మూడు సినిమా చేసుంటే చై కెరీర్ మరో లా ఉండేది...!