'కేజీఎఫ్' సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Anilkumar
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ kgf సిరీస్ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు  దానిని ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు.అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రికార్డ్స్ చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు.ఇకపోతే కనీసం 50 కోట్ల రూపాయిలు మార్కెట్ కూడా లేని కన్నడ వంటి చిన్న చలన చిత్ర పరిశ్రమ నుండి విడుదల అయింది ఈ సినిమా .కాగా  ఈ సినిమా ఇండియాలోనే టాప్ 2 హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అని ఎవ్వరు కలలో కూడా ఊహించి ఉండరు.ఇకపోతే kgf చాప్టర్ 2 చిత్రం ఇటీవల విడుదల అయిన రాజమౌళి భారీ మల్టీస్టార్ర్ర్ #RRR సినిమా వసూళ్లను కూడా వెనక్కి నెట్టడం జరిగింది. అయితే  ఈ చిత్రం 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది అంటే నిజంగా కన్నడ సినీ పరిశ్రమకి గర్వకారణం అనే చెప్పాలి.

ఇదిలావుంటే ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు ఈ సినిమా హీరో యాష్ ఇప్పుడు ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా సూపర్ స్టార్స్ గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది.ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా కథని తొలుత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ని ఊహించుకొని రాసాడట ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్.అయితే ఇలాంటి ప్రాజెక్ట్ ని హృతిక్ రోషన్ లాంటి మంచి పాపులారిటీ మరియు క్రేజ్ ఉన్న హీరో చేస్తే న్యాయం జరుగుతుంది అని బలంగా నమ్మాడట ప్రశాంత్ నీల్.ఇకపోతే ఈ స్టోరీ ఎలా అయిన హృతిక్ రోషన్ కి వినిపించాలని ప్రశాంత్ నీల్ అప్పట్లో చాలా ప్రయత్నాలే చేసాడట.అయితే...కానీ హృతిక్ రోషన్ చుట్టూ ఉన్నవారు ప్రశాంత్ నీల్ కి కనీసం అప్పోయింట్మెంట్ కూడా ఇప్పించలేదట.

కాగా నార్త్ వాళ్లకి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ  అంటే మొదటి నుండి చిన్న చూపు అనే విషయం మన అందరికి తెలిసిందే.ఇకపోతే హృతిక్ రోషన్ ని కనీసం కలిసే ఛాన్స్ కూడా ఇవ్వకపోవడం తో ప్రశాంత్ నీల్ ఈగో బాగా హర్ట్ అయ్యిందట.అంతేకాదు వాళ్ళు నాకు అవకాశం ఇవ్వడం కాదు.కాగా నా చుట్టూ బాలీవుడ్ స్టార్ హీరోలందరూ తిరగాలి.ఇక ఈ kgf సినిమాని కన్నడ హీరోతోనే తీస్తా అని శపధం చేసి యాష్ ని హీరో గా పెట్టి బాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని భూస్థాపితం చేసాడు.ఇదిలావుండగా ప్రస్తుతం బాలీవుడ్ లో kgf చాప్టర్ 2 టాప్ 2 గా నిలిచింది.అంతేకాదు టాప్ 1 గా బాహుబలి పార్ట్ 2 నిలబడగా..టాప్ 3 గా #RRR సినిమా నిలిచింది.ఇక ఇలా ఇండియా లోనే వరుసగా టాప్ 3 స్థానాలను కబ్జా చేసేసింది మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ .అయితే ఏ ఇండస్ట్రీని అయితే బాలీవుడ్ హీరోలు చిన్న చూపు చూసారో ఇక ఇప్పుడు ఆ హీరోలందరూ మన సౌత్ సినిమా డైరెక్టర్స్ చుట్టూ తిరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: