బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరొక హీరో సినిమా..!!

Divya
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. స్వాతి ముత్యం అనే ఒక క్లాసికల్ టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో గణేష్ కు జంటగా వర్ష బొల్లమ్మ నటిస్తున్నది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యువనిర్మాత సూర్యదేవర ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతోంది. ఈచిత్రంతో కె కృష్ణ నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ , గ్లింప్స్ ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ని తీసుకు వచ్చాయి అని చెప్పవచ్చు. లవ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఒక పోస్టు ద్వారా తెలియజేశారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించారు జరిగింది.


డైరెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ స్వాతిముత్యం సినిమా కుటుంబసమేతంగా చూడవచ్చని స్వాతిముత్యం లాంటి ఓ యువకుడు కథ అని తెలిపారు. జీవితం ,ప్రేమ, పెళ్లి ఆలోచనలు అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగింది అనే కథాంశంతో సినిమాని తెరకెక్కించడం జరిగింది అని తెలిపారు. ఈ సినిమాలో వినోదం పుష్కలంగా లభిస్తుంది సగటు ప్రేక్షకులు కూడా సినిమాను చూసి నవ్వుకుంటారు అని తెలియజేశారు ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ రావు, రమేష్ సుబ్బరాజు, సప్తగిరి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు గా తెలియజేశారు. మరి బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ చేస్తున్న ఈ హీరో ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: