నవీన్ పోలిశెట్టి సరసన శ్రీ లీల..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ లీల తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి పెళ్లి సందD మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయిన ప్పటికీ ఈ మూవీ లో శ్రీ లీల నటనకు, అంతకు మించిన అందచందాలకు, డాన్సులకు మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి.


అలా మొదటి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే తన అందచందాలతో,  నటన తో, డ్యాన్స్ తో అలరించిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా మూవీ లో రవితేజ సరసన  కథానాయికగా నటిస్తున్న శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ సినిమా ఆఫర్ ను కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నవీన్ పోలిశెట్టి హీరో గా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనగనగా ఒక రాజు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ అనగనగా ఒక రాజు మూవీ లో నవీన్ పొలిశెట్టి సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతున్నట్లు తాజాగా ఒక పోస్టర్ ద్వారా కన్ఫామ్ చేసింది.


ఇలా  పెళ్లి సందD మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని దక్కించుకొక పోయినప్పటికీ ప్రస్తుతం మాత్రం శ్రీ లీల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ లకు పోటీగా వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ ను  ముందుకు సాగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: