తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే విజయ్ మొదటిసారి తెలుగులో నటిస్తున్న ఈ స్ట్రైట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రష్మికా మందన్నా ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకపోతే తెలుగుతో పాటుగా తమిళంలోనూ తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే అభిమానులు ఈ సినిమా నుంచి విజయ్ బర్త్ డే ట్రీట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక విజయ్ కొత్త మూవీ నుంచి ఫస్ట్ లుక్ అలాగే, టైటిల్ కూడా రివీల్ చేస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన వార్తలు కూడా దీనికి సబందించే. ఇక ఈ నెలలోనే విజయ్ బర్త్ డే ఉంది.ఇకపోతే ప్రతీ ఏడాది తన బర్త్ డేకి విజయ్ కొత్త మూవీకి సంబధించిన ఏదో ఒక అప్‌డేట్ ఇచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంటాడు.అయితే అలాగే, ఈ సారి కూడా తన 66వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్,...అంతేకాదు అలాగే సినిమా టైటిల్ కూడా రివీల్ అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది.
ఇకపోతే ఇప్పటికే, టైటిల్ కూడా లాక్ చేశారని సమాచారం. కాగా జూన్ 22న విజయ్ బర్త్ డే కానుకగా ఈ అప్‌డేట్స్ రాబోతున్నాయని తెలుస్తోంది. అయితే మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలావుండగా ఇటీవల వచ్చిన 'బీస్ట్' సినిమాతో విజయ్ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.యావరేజ్ టాక్ తోనే ఈ సినిమా 100 కోట్ల వసూళ్లను అందుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు దర్శకుడు నెల్సన్ ఈ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తోంది...!!