ఆ సినిమాకు రెమ్యునిరేషన్ వద్దన్న ఇచ్చారు... సాయి పల్లవి.!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఫిదా మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీ లోనే తన డాన్స్ తో, నటనతో సాయి పల్లవి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. అలా ఫిదా సినిమాతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి ఆ తర్వాత అనేక టాలీవుడ్ మూవీ లలో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. 


ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలకు , స్కిన్ షో కు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ సాయి పల్లవి ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీ లో  ఫుల్ క్రేజ్ వున్నప్పటికీ సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టదు అని తెలుస్తోంది. అలాగే సినిమా స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు , ఒక వేళ సినిమా కనుక అనుకున్న రేంజ్ రిసల్ట్ ను సాధించినట్లయితే రెమ్యునిరేషన్ ను కూడా సాయి పల్లవి తగ్గించుకుంటుంది అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఒక సినిమా రెమ్యునిరేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.  


సాయి పల్లవి , శర్వానంద్ హీరోగా తెరకెక్కిన పడి పడి లేచే మనసు సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచి ఫ్లాప్ గా నిలిచింది. అలా ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మ అడ్వాన్స్ తర్వాత ఇచ్చే అమౌంట్ ను వద్దు అని చెప్పిందట. అయినప్పటికీ సినిమా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మాత్రం సాయి పల్లవి కి రావాల్సిన మొత్తం అమౌంట్ సెటిల్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: