కేటీఆర్ చేతులమీదుగా విడుదలకానున్న సమ్మతమే మూవీ ట్రైలర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస పెట్టి మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం సరసన చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా ,  ఈ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ మూవీ ని జూన్ 24 వ తేదీన విడుదల చేయబోతున్నారు .


ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ వేగవంతం చేయబోతోంది . అందులో భాగంగా తాజాగా సమ్మతమే చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే సమ్మతమే మూవీ ట్రైలర్ ను తెలంగాణ మంత్రివర్యులు అయిన కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


ఇది ఇలా ఉంటే కిరణ్ అబ్బవరం ఆఖరిగా సెబాస్టియన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించిన కిరణ్ అబ్బవరం తన నటనతో ప్రేక్షకులను అలరించినప్పటికి సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సేబాస్టియన్ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ ను ఎదుర్కొన్న కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' మూవీ తో తిరిగి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కిరణ్ అబ్బవరం ఈ మూవీ తో పాటు నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: