లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి , మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటించగా, తమిళ స్టార్ హీరోల్లో ఒకరు అయిన సూర్య ఈ మూవీ లో గెస్ట్ రోల్ లో కనిపించి అలరించాడు.
మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న విక్రమ్ మూవీ జూన్ 3 వ తేదీన తమిళ , తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తోంది. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న విక్రమ్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 7 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ బరిలో దిగింది.
మొదటి నుండి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడంతో 13 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలలో విక్రమ్ మూవీ 14.42 కోట్ల షేర్ , 25.11 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ విజయం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ లో బరిలో దిగిన విక్రమ్ సినిమా 13 రోజుల బాక్సాఫీస్ రన్ పూర్తయ్యేసరికి 6.92 కోట్ల లాభాలను సాధించింది. ఇప్పటికి కూడా విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది.