తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల బీస్ట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలవడంతో, తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు హీరో విజయ్.అయితే విజయ్ కెరీర్లో 66వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండటం విశేషం.కాగా ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంతుంది.
కాగా చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్లు తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విజయ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాకు టైటిల్‌ను లాక్ చేసినట్లుగా చిత్ర వర్గాల్లో ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమాకు 'వారసుడు' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇది కేవలం తెలుగుకు మాత్రమే టైటిల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.
కాగా తమిళ వర్షన్‌కు వేరొక టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయబోతుందట.
ఇక అసలు విషయం ఏమిటంటే గతంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన 'వారసుడు' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.అయితే మరి విజయ్ కోసం ఇదే టైటిల్‌ను పట్టుకొస్తున్న వంశీ పైడిపల్లి, ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.ఇకపోతే ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే మరి ఈ సినిమాకు తమిళంలో ఏ టైటిల్ పెడతారా.. ఈ సినిమాలో విజయ్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది చూడాలి..!!