టాలీవుడ్
సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో ఒకరు అయినా
ఆశిష్ 'రౌడీ బాయ్స్' సినిమాతో
వెండి తెరకు పరిచయం అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో
ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. మంచి అంచనాల నడుమ
సంక్రాంతి కానుకగా విడుదల అయిన రౌడీ బాయ్స్ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సాధించింది .
ఈ సినిమాను మెడికల్ మరియు ఇంజనీరింగ్
కాలేజీ స్టూడెంట్ ల మధ్య ఒక
అమ్మాయి ద్వారా గొడవలు జరగడం, చివరికి ఏమి జరిగింది అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇది ఇలా ఉంటే రౌడీ బాయ్స్ సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న
ఆశిష్ ప్రస్తుతం సెల్ఫిష్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు
విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నాడు. సెల్ఫిష్
మూవీ ని దర్శకుడు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. రౌడీ బాయ్స్ సినిమాతో పోల్చుకుంటే
ఆశిష్ 'సెల్ఫీస్'
మూవీ కోసం తన మేక్ ఓవర్ ను దాదాపుగా చాలా వరకు మార్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే సెల్ఫిష్
సినిమా కోసం
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు అయిన
సుకుమార్ కూడా సహాయం చేస్తుండటం విశేషం.
అలా సెల్ఫీస్
మూవీ కోసం
సుకుమార్ సహాయం చేస్తూ ఉండడంతో ఆశిస్తూ సోషల్
మీడియా వేదికగా తాజాగా ఒక పోస్ట్ చేశాడు. సుక్కు అన్న మా సెల్ఫిష్
మూవీ కోసం మంచి డైలాగ్స్, అలాగే ఇతర ఇన్ పుట్స్ ఇచ్చినందుకు మరియు ఈ
మూవీ ని మీ భుజాలపై తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సోషల్
మీడియా వేదికగా
ఆశిష్ తెలిపాడు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్న ఈ
మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.