ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్ విషయంలో ఏడాది ముందే ఓ క్లారిటీకి వచ్చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త
సినిమా విషయంలో అలాంటి క్లారిటీతోనే ఉన్నారట నిర్మాతలు.అయితే 'ఆర్ఆర్ఆర్' లాంటి భారీ సక్సెస్ తర్వాత
కొరటాల శివ డైరెక్షన్‌లో నటించనున్నాడు ఎన్టీఆర్. కాగా కళ్యాణ్ రామ్‌తో కలిసి
మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇక అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఇకపోతే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అయితే దీంతో ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.ఇక షూటింగ్ మొదలవడానికి ముందే రిలీజ్‌డేట్ గురించి ఓ అప్‌డేట్ వినిపిస్తోంది. కాగా వచ్చే ఏడు మే నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట.అంతేకాక అదికూడా ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా.ఇకపోతే ఫస్ట్‌లుక్ విడుదలైన మే 19నే సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే షూటింగ్ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ
సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో నటించనున్నాడు ఎన్టీఆర్. వచ్చే ఏడు ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
అయితే మే లో ఫస్ట్ లుక్ రానుంది. ఆఖరికి మొత్తానికి నెక్స్ట్ ఇయర్ తన బర్త్‌డేకి రెండు చిత్రాలతో డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు ఎన్టీఆర్.ఇక
ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా విషయానికి వస్తే.. ఈ
సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఈ
సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని
కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్
సినిమా కమర్షియల్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ కాబోతుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎన్టీఆర్ ఆర్ట్స్,
యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై
కళ్యాణ్ రామ్,
మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...!!