యాక్షన్ సీన్స్ కు అందాల భామలు సై..!

NAGARJUNA NAKKA
సమంత 'ఫ్యామిలీమెన్2'కి ముందు వరకు రెగ్యులర్‌ హీరోయిన్‌ క్యారెక్టర్స్‌లోనే కనిపించింది. పాటలు లవ్‌ ట్రాక్‌ వరకే పరిమితమైంది. అయితే ఈ వెబ్‌ సీరీస్‌లో సామ్‌ పూర్తి భిన్నంగా కనిపించింది. ఎల్టీటీఈ కమాండర్‌ రాజీగా హై వోల్టేజ్‌ యాక్షన్ సీన్స్‌  చేసింది. ఇక ఇప్పుడు 'యశోద' సినిమాలో కూడా సమంత ఫైటింగులు చేయబోతోంది. 'ఫ్యామిలీమెన్‌2'కి స్టంట్స్ కంపోజ్‌ చేసిన యానిక్‌ బెన్‌, 'యశోద'కి కూడా యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నాడు.
కీర్తి సురేశ్‌ 'మహానటి'తో సింగిల్ హ్యాండెడ్‌గా బాక్సాఫీస్‌ని మేనేజ్ చేయగలదని ప్రూవ్‌ చేసుకుంది. ఆ తర్వాత 'పెంగ్విన్, బ్యాడ్ లక్ సఖి' లాంటి సినిమాలు చేసింది. అయితే వీటిల్లో యాక్షన్‌ సీన్స్‌ చేయలేదు గానీ, కథని మాత్రం నడిపించింది. అయితే 'చిన్ని' సినిమాలో మాత్రం కీర్తి యాక్షన్‌ క్వీన్‌లా కనిపించింది. తుపాకి పట్టి బుల్లెట్లు కురిపించింది.
నివేదా థామస్, రెజీనా లీడ్‌ రోల్స్‌లో వస్తోన్న లేడీ ఓరియెంటెడ్‌ ఫిల్మ్ 'శాకినీ డాకినీ'. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇద్దరూ పోలీస్‌ క్యారెక్టర్స్‌ ప్లే చేశారు. ఇక ఈ మూవీలో హై వోల్టేజ్‌ యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయని, వాటిల్లో నివేదా, రెజీనా ఇద్దరూ డూప్‌ లేకుండా చేశారని చెప్తున్నారు.
హీరోయిన్లు ఫిట్‌నెస్‌ కోసం కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. రొటీన్‌గా చేసే జిమ్‌, యోగాలతో పాటు క్యాలరీలు మరింత కరిగించుకోడానికి పవర్‌ వర్కవుట్స్ చేస్తున్నారు. ఆ మధ్య అందరూ జుంబా డాన్సుల్లాంటి వాటిమీద పడితే, ఇప్పుడు కిక్‌ బాక్సింగ్‌ వైపు వెళ్తున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌తో ఫిట్‌నెస్‌ లెవల్స్‌ పెంచుకుంటున్నారు.
రష్మిక మందన్న సినిమాల్లో చాలావరకు బబ్లీ గర్ల్‌ క్యారెక్టర్స్ మాత్రమే చేసింది. నాలుగు పాటలు, నాలుగు సీన్స్‌ లాంటి రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించింది. కానీ సాఫ్ట్‌గా కనిపించే ఈ శ్రీవల్లిలో ఒక మార్షల్ ఆర్ట్స్‌ చాంపియన్‌ కూడా ఉంది. ఫిట్‌నెస్‌ లెవల్స్‌ పెంచుకోవడానికి జిమ్, యోగాతో పాటు మార్షల్స్ ఆర్ట్స్‌లో కూడా ట్రైనింగ్ తీసుకుంటోంది రష్మిక. అంతేకాదు దుల్కర్‌ సల్మాన్, మృణాల్ ఠాకూల్ 'సీతారామం'లో రష్మిక స్ట్రాంగ్‌ రోల్  చేస్తోంది. యాక్షన్‌ సీన్స్‌ కూడా చేసిందని చెప్తున్నారు.
హీరోయిన్స్‌లో ఫిట్‌నెస్ ఫ్రీక్‌ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు రకుల్‌ప్రీత్‌ సింగ్. ఎఫ్-45 పేరుతో ఫిట్‌నెన్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌ కూడా రన్ చేస్తోన్న రకుల్‌, తన ఫిట్‌నెస్‌ని మరింత పెంచుకోవడానికి మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌ తీసుకుంటోంది. జిమ్, యోగాలతో పాటు కిక్‌ బాక్సింగ్‌ కూడా నేర్చుకుంటోంది.
శ్రుతీ హాసన్‌ 'కాటమరాయుడ'  టైమ్‌లో బొద్దుగా కనిపించింది. ఆ తర్వాత సినిమాలు కూడా తగ్గాయి. అయితే బ్రేకప్‌ తర్వాత బరువు తగ్గి మళ్లీ సినిమాలు చేస్తోంది. 'సలార్' లాంటి పాన్‌ ఇండియన్‌ మూవీస్‌లో నటిస్తోంది. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌ని పీక్స్‌కి తీసుకెళ్లడానికి ఫిట్‌నెస్‌ని కాపాడుకోవాలి. అందుకే జిమ్‌ వర్కవుట్స్‌తో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటోంది శ్రుతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: