మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని ఎందుకు నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఈ సినిమాలో లో వైష్ణవి తేజ్ కి జోడిగా కృతి శెట్టి నటించిన సంగతి అందరికీ తెలిసిందే .అయితే డెబ్యూ సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించాడు ఈయన.అంతకాక స్టార్ హీరోల రేంజ్లో కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్య పరిచాడు.ఇకపోతే ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ చిత్రాన్ని చేశాడు.
కాగా గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ చిత్రం రూ.10 కోట్ల కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది.అయితే రెండవ సినిమా ఫలితం వైష్ణవ్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.ఇదిలావుంటే ప్రస్తుతం ఈయన శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఇకపోతే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.కాగా ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మించనున్నాడట. పోతే త్రివిక్రమ్ సొంత బ్యానర్ అయిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై, సితార ఎంటర్టైనమెంట్స్తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాడని టాక్.
అయితే త్వరలోనే దీనిపై అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ చిత్రంలో ‘పెళ్ళి సందD’ ఫేం శ్రీలీలా హీరోయిన్గా నటించనుందని సమాచారం. ఇదిలావుండగా ప్రస్తుతం వైష్ణవ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ విడుదలకు సిద్ధంగా ఉంది.ఇకపోతే గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్గా నటించింది.ఇకపోతే ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.అయితే కానీ ఇప్పటివరకు ఈ చిత్రంపై ఎలాంటి బజ్ లేదు. కాగా చిత్రం నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేవు.అయితే మరి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తారా?ఇక లేదంటే అదే రోజున విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది..!!