దానితో ఎంతో మంది
బాలీవుడ్ హీరోలు సౌత్
ఇండస్ట్రీ దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు . అలాగే సౌత్ ఇండస్ట్రీలో మంచి విజయాలు సాధించిన సినిమాలను
బాలీవుడ్ లో
రీమేక్ చేయడానికి కూడా
బాలీవుడ్ హీరోలు , దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అలాగే సౌత్
సినిమా పై
బాలీవుడ్ స్టార్ హీరోలు , దర్శకనిర్మాతలు కూడా మంచి ప్రశంసలను చేస్తున్నారు . అందులో భాగంగా తాజాగా
బాలీవుడ్ స్టార్
హీరో అయినా
వరుణ్ ధావన్ ఒక సౌత్
సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సౌత్
ఇండస్ట్రీ నుండి వచ్చి భారీ
బ్లాక్ బస్టర్ విజయం సాధించిన కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ గురించి మనకు తెలిసిందే. ఈ
సినిమా ఇండియా వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసి అదిరిపోయే కలెక్షన్ లను రాబట్టింది.
ఈ
సినిమా హిందీ ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఇది ఇలా ఉంటే వరుణ్ ధావన్ తాజాగా కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ గురించి మాట్లాడుతూ... థియేటర్ లో కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ చేసే సమయంలో తప్పట్లు కొట్టి... ఈలలు వేశారు అని చెప్పుకొచ్చాడు. అలాగే
రాజమౌళి తో ఎలాగైనా
సినిమా చేయాలి అని అనుకుంటున్నట్టుగా కూడా
వరుణ్ ధావన్ పేర్కొన్నాడు పేర్కొన్నాడు.