ప్రస్తుతం
థియేటర్ లలో విడుదలైన సినిమాలు ఎంత వేగంగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయో మన అందరికీ తెలిసిందే.
థియేటర్ లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కొన్ని అతి తక్కువ రోజుల్లోన 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి.
అలాగే స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచినట్లు అయితే అలాంటి
మూవీ లు కూడా అతి తక్కువ రోజుల్లోనే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి.
థియేటర్ లలో విడుదలై మంచి టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన కొన్ని సినిమాలు కూడా అతి తక్కువ రోజుల్లోనే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా
హిందీ లో విడుదలై
బ్లాక్ బస్టర్ విజయం సాధించిన భూల్ భులయా 2,
మూవీ కూడా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' లోకి రాబోతోంది. ఈ సినిమాలో
కార్తిక్ ఆర్యన్ , కియారా అద్వానీ హీరో ,
హీరోయిన్ లుగా నటించగా ఈ
మూవీ లో టబు ఓ కీలక పాత్రలో నటించింది.
ఈ
సినిమా హారర్
కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కి
బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లను సాధించి
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ
హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీ కి
అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించాడు .ఈ సినిమాను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నేట్ ఫ్లిక్స్ లో 19
జూన్ 2022 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ప్రేక్షకులు ఎంతగానో అలరించిన ఈ
సినిమా 'ఓ టి టి' లో ప్రేక్షకులను ఎ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.