టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలలో ఒకరు అయిన అక్కినేని
అఖిల్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అక్కినేని
అఖిల్ ప్రస్తుతం
టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్
రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏజెంట్
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే .
ఈ సినిమాలో అక్కినేని
అఖిల్ సరసన
సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది . ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ
టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది . ఈ
సినిమా లో
మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ
మూవీ ని రామబ్రహ్మం
సుంకర నిర్మిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ సినిమాను ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది . కాకపోతే చిత్ర బృందం ప్రకటించిన విడుదల తేదీ దగ్గర పడటంతో , ఈ
సినిమా పనులు చాలా వరకు పెండింగ్ లో ఉండటంతో ఈ
సినిమా విడుదలను వాయిదా వేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది .
అయితే ఆగస్ట్ 12 వ తేదీన ఈ
సినిమా విడుదలను వాయిదా వేసి
దసరా సందర్భంగా
అక్టోబర్ 5 వ తేదీన లేదా 6 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనను చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేయలేదు . ఇది ఇలా ఉంటే ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న
అఖిల్ 'ఏజెంట్' సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.