బ్రేకప్: చార్మీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాకయ్యే షాకిచ్చిన పూరీ!

Purushottham Vinay
ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్నారు. తన వైష్ణో అకాడమీనే పూరీ కనెక్ట్స్ గా మార్చి సొంత నిర్మాణ సంస్థను కూడా స్థాపించడం జరిగింది. పూరీ బ్యానర్ వ్యవహారాలు అన్నీ కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఫేడ్ ఔటెడ్ హీరోయిన్ చార్మీ చూసుకుంటూ ఉంటుంది. ఇక సినిమా అవకాశాలు లేక చార్మీ పూరీకి బాగా దగ్గరైన సంగతి అందరికీ తెలిసిందే పూరి జగన్నాథ్ ఎక్కడ ఉంటే కచ్చితంగా ఛార్మి కూడా అక్కడే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.  ఇప్పటికే తన తండ్రి అడుగుజాడలలో ఆకాశ్ నడుచుకుంటూ టాలీవుడ్లో మంచి హీరో అవుతాడని  అందరూ భావిస్తున్నారు.ఇక పూరి జగన్నాథ్ కూతురు ఇటీవల తన విద్యను పూర్తి చేసుకొని సినిమాల పట్ల తనకు ఉన్న ఆసక్తి కారణంగా తన తండ్రి తో మాట్లాడి నిర్మాణ బాధ్యతలను చూసుకుంటానని పూరికి తెలియజేసినదట. దీంతో పూరీ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం తెలుస్తుంది.



ప్రస్తుతం పూరీ జగన్నాథ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం త్వరలోనే పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన పోకిరి సినిమా తరువాత ఆ రేంజ్ హిట్ పూరికి దక్కలేదు. టెంపర్, ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన కానీ పోకిరి సాధించిన వసూళ్ల దారిదాపుల్లోకి రాలేదు. అందువల్ల ఏ స్టార్ హీరో పూరికి అవకాశం ఇవ్వలేదు. దాంతో ప్లాపుల్లో వున్న విజయ్ దేవరకొండతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. లైగర్ తరువాత మళ్ళీ వెంటనే విజయ్ తో కలిసి జనగణమన సినిమాను పూరి తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంతోనే డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కూతురు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక నిర్మాణ బాధ్యతలు తన కూతురికి ఇవ్వడంతో ఛార్మి పరిస్థితి ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లాగా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: