లోక నాయకుడు కమల్ హాసన్ తాజాగా
విక్రమ్ మూవీ లో
హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.
జూన్ 3 వ తేదీన విడుదల అయిన
విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన
విక్రమ్ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని కమల్ హాసన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.
ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ 'విక్రమ్'
సినిమా కంటే ముందు భారతీయుడు 2
సినిమా చేయవలసింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ
సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆగిపోయింది. భారతీయుడు 2
మూవీ కి
శంకర్ దర్శకత్వం వహించగా ఈ సినిమాలో
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ హాసన్ భారతీయుడు 2
మూవీ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ను తెలియజేశాడు. భారతీయుడు 2
మూవీ కచ్చితంగా
శంకర్ దర్శకత్వంలోనే తిరిగి స్టార్ట్ అవుతుంది అని , భారతీయుడు 2
మూవీ గురించి ఫ్యాన్స్
కన్నా నేనే ఒకింత ఎక్కువగా ఎగ్జిట్ అవుతున్నాను అని, ప్రస్తుతం
శంకర్ ,
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.