రామ్ చరణ్ .. శంకర్ సినిమా తర్వాత ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడా..?
ఇక చెప్పినట్లుగానే మాస్టర్, విక్రమ్ సినిమాలో ను సూపర్ డూపర్ హిట్ కొట్టేలా చేశారు లోకేష్ కనకరాజు. ఇక రామ్ చరణ్ కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం. కాని రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫినిష్ చేసిన వెంటనే రామ్ చరణ్ తో లోకేష్ తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
మరొకవైపు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఇది వరకే కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమాలో తన తండ్రి తో నటించిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక దీనితో రామ్ చరణ్ తో మరొక సారి మూవీని తెరకెక్కించి మంచి విజయాన్ని చేకూర్చాలని కసితో కొరటాల శివ ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం కథను సిద్ధం చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. మరి రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తారో చూడాలి.