ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్.. ఈసారైనా సెట్ అయ్యేనా..?

Anilkumar
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  గురించి మనకి తెలియనిది కాదు.ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు.ఇదిలావుంటే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది.అంతేకాదు. ఎన్టీఆర్, చరణ్ లను పాన్ ఇండియా స్టార్ లుగా మార్చేసింది. ఇకపోతే ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.
ఇదిలావుంటే  ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. అంతేకాకా పలు కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదకు ఇంకా వెళ్ళలేదు.కానీ ఇక  బ్యాకప్ లో మాత్రం స్పీడ్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే  ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 9 కేజీల బరువు తగ్గుతున్నాడు.కాగా దీని కోసం ఇప్పటికే కసరత్తులు కూడా స్టార్ట్ చేసాడు.అయితే  ఆగష్టులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే  ఎన్టీఆర్ తర్వాత సినిమా కూడా ఫిక్స్ అయ్యింది. కాగా అది కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అఫిషియల్ గా ప్రకటించారు.అంతేకాకుండా కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన 31వ సినిమా చేయనున్నాడు.అయితే  ప్రకటించమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా నీల్ ఎప్పటి లాగానే ఈ బ్లాక్ థీమ్ తో రివీల్ చేసాడు.
ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ గుబురు గడ్డంతో మెలితిప్పిన మీసంతో ఆకట్టు కున్నాడు. ఇకపయో దీంతో కొరటాల సినిమా కంటే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.ఇక  ఇది పక్కన పెడితే నీల్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హీరోయిన్ కోసం వేట జరుగుతుంది.పోతే ఎవరిని ఫైనల్ చేయాలా అని నీల్ టీమ్ మొత్తం పలు రకాలుగా చర్చించు కుంటున్నారు.ఇదిలావుంటే  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుందని వార్తలు వచ్చాయి.తాజాగా ఇప్పుడు ఈమె కాదు జాన్వీ కపూర్ నటించనుంది అంటూ మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే దీంతో ఏది నిజం ఏది అబద్ధమో అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పోతే  ఈ సినిమా రెగ్యురల్ షూట్ నవంబర్ రెండవ వారం నుండి స్టార్ట్ కాబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: