రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ వదులుకున్న తెలుగు అమ్మాయి..!!
ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కీలకమైన పాత్రలో కూడా నటించింది. హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను వదులుకున్న సినిమాల గురించి కూడా తెలియజేసింది. హీరోయిన్ గా చాందిని చౌదరి కెరీర్ ఆరంభంలోనే ఊహలు గుసగుసలాడే వంటి చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. సినిమాలో నటించాల్సిందిగా మేకర్స్ అడగగా ఆ సమయంలో ఈమె తనకు కాస్త సమయం కావాలని కోరిందట. కానీ ఈమె స్పందించకపోవడంతో ఆ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా ఎంపికై మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమా ఆఫర్ వచ్చిందట. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు తెరకెక్కించారు ఈ చిత్రం ఒక బోర్డు గర్ల్ కథ చక్కగా చూపించడం జరిగింది. కానీ ఈ సినిమాని కూడా చాందిని ఓకే చెప్పకుండా సున్నితంగా తిరస్కరించిందట. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి కెరీర్ ప్రారంభంలోనే రెండు పెద్ద ప్రాజెక్టులు వదిలేసి ఇప్పుడు మంచిగానే ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇక హీరోయిన్ల వరస సినిమాలు చేస్తున్న సమయంలోనే వెబ్ సిరీస్ లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం జరుగుతోంది.