హాట్ టాపిక్ గా ప్రభాస్ రెమ్యునరేషన్.. 'ఆదిపురుష్' కోసం అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్....బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్‌ సహా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలావుంటే తాజాగా విడుదలైన రాధేశ్యామ్ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అయినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని హిందీ మీడియాలో కధనాలు వైరల్ అయ్యాయి.ఇక తాజాగా  ఆయన ఆదిపురుష్ సినిమా కోసం రెమ్యునరేషన్ పెంచిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తాజాగా తానాజీ ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతిసనన్ జంటగా ఆదిపురుష్ తెరకెక్కుతోంది.

ఇకపోతే  ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా కృతి సీత పాత్రలో నటిస్తోంది.పోతే  బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమా రెమ్యునరేషన్ పెంచమని ప్రభాస్ డిమాండ్ చేసినట్టు బాలీవుడ్ మీడియా కధనాలు ప్రచురించింది. ఇకపోతే ముందు ఈ సినిమాకు 100 కోట్ల దాకా తీసుకుంటానని ప్రభాస్ చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడు ఆదిపురుష్ నిర్మాతల నుంచి ప్రభాస్ రూ.120 కోట్లు కోరుతున్నాడని కథనంలో పేర్కొన్నారు.

ఇక ప్రభాస్ దెబ్బతో ఆదిపురుష్ బడ్జెట్ ఒక్కసారిగా 25 శాతం పెరగనుందని, ఈ పరిస్థితి నిర్మాతలకు ఇబ్బందికరమే అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. ఇది ప్రచారమే కాగా నిజమయ్యే సూచనలు తక్కువే అని అంటున్నారు.ఇక  ఎందుకంటే ఒక హీరోకి మొదలు సినిమా కోసం పని చేస్తున్న ఎవరికైనా ఎంత చేల్లిస్తామనే విషయాన్ని నిర్మాణ సంస్థలు ముందుగానే అగ్రిమెంట్లు చేసుకుంటాయి.అయితే ఒక్కోసారి హీరోలు కొంత మొత్తమే డబ్బు తీసుకుని లాభాల్లో వాటా కోరతారు.కాగా  అలాంటప్పుడు రిస్క్ కూడా ఉంటుంది, కానీ సినిమా హిట్ అయితే కోట్లు వచ్చి పడతాయి. ఇలా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా రెమ్యునరేషన్ పెంచడం అనేది నిజం కాకపోవచ్చు అనే వాదన వినిపిస్తోంది.ఇకపోతే  ఒకవేళ నిజమైతే ఇండియాలోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకునే హీరోగా నిలిచిపోనున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: