దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్పే మాట.ఇకపోతే సినీ రంగంలో
హీరోయిన్స్ ఈ సమేతను బాగా ఫాలో అవుతారు. అయితే
ఇండస్ట్రీ లో స్టార్
హీరోయిన్ గా ఉన్న టైంలోనే నాల్గు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు.ఇక అందుకే ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ రంగంలో అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఇలా చేస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పుడు తాజాగా
రష్మిక కూడా అదే బాటలో పయనం సాగిస్తుంది. కాగా కన్నడలో కిరాక్
పార్టీ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన రష్మిక..
తెలుగులో
ఛలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఇక ఆ తర్వాత 'గీత గోవిందం' సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ
ఆడియన్స్ ను ఆకట్టుకుంది.ఇకపోతే ఆ
సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. అయితే ఈ మధ్యనే
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప
మూవీ లో
రష్మిక నటించి ఆకట్టుకుంది. కాగా ఈ
సినిమా పాన్
ఇండియా లెవల్లో విడుదల అవడంతో అమ్మడు పాపులార్టీ బాగా పెరిగింది. ఇదిలావుంటే తెలుగు ,
తమిళ్ ,
హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ గట్టిగానే సంపాదిస్తుంది.అయితే ఆ సంపాదనతోనే ఇప్పుడు వ్యాపారం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ఇకపోతే తాజాగా
రష్మిక వేగన్
బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.
అంతేకాక ఈ సంస్థకి
రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు సదరు సంస్థ ప్రకటించడంతోనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇకపోతే ఇక్కడ అమ్మడు తన స్టార్ డమ్ నే పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. కాగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా..వచ్చే ఆడబ్బునే పెట్టుబడిగా అదే సంస్థలో పెట్టి భాగస్వామిగా శాతాన్ని అందుకుంటుంది.అయితే ఇప్పటికే
రష్మిక కొన్ని సంస్థల్ని ఎండార్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వాటిలో ఎలాంటి భాగస్వామ్యం కోరలేదు. పోతే కేవలం పారితోషికం ప్రాతిపదికనే ఎండార్స్ చేస్తోంది. అంతేకాకుండా వేగాన్
బ్యూటీ ప్రొడక్స్ట్ కి మాత్రం పార్టనర్ గా మారినట్లు తెలుస్తోంది.అయితే ఇలాంటి బిజినెస్ స్ర్టాటజనీ ఇప్పటికే కొంత మంది హీరోయిన్లు అనుసరిస్తున్నారు.ఇక వాళ్ల బాటలోనే
రష్మిక కూడా కొత్త ప్రయాణం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది..!!