టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరైన
నాగ చైతన్య తాజాగా థాంక్యూ
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
రాశి కన్నా
హీరోయిన్ గా నటించగా, విక్రమ్ కే
కుమార్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితం థాంక్యూ
మూవీ ని జూలై 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది .
అందులో భాగంగా ఈ
సినిమా టీజర్ ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాను జూలై 8 వ తేదీన విడుదల చేయడం లేదు అని, జులై 22 వ తేదీన విడుదల చేయబోతున్నాము అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే జూలై 22 వ తేదీన నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన
కార్తికేయ 2 మూవీ ని విడుదల చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇన్ని రోజుల వరకు ఈ సినిమాకు కేవలం
బాలీవుడ్ మూవీ షాంషేర్
మూవీ తో తప్ప వేరే ఎ
మూవీ తో పోటీ లేదు.
తాజాగా
నాగ చైతన్య నటించిన థాంక్యూ
మూవీ ని కూడా జులై 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృంద ప్రకటించడంతో
కార్తికేయ 2 సినిమాకు బాక్సాఫీస్ దగ్గర గట్టి సవాలే ఎదురు అయ్యేలా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే
కార్తికేయ సినిమా మంచి విజయం సాధించడంతో
కార్తికేయ 2 సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే కార్తికేయ2 మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా నటిస్తుంది.