బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్
బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైన సంగతి తెలిసిందే. ఇక ఈమె
ఆర్ఆర్ఆర్ లో
అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ఇటివల
అలియా భట్ రెండు నెలల క్రితమే ఏప్రిల్ లో తన ప్రియుడు,
బాలీవుడ్ స్టార్
రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది.ఇకపోతే వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలసి నటిస్తున్నారు.ఇక అలియా, రణబీర్ ఇద్దరూ
బాలీవుడ్ స్టార్ కపుల్స్.
పోతే వీరిద్దరూ ఎక్కడ కనిపించినా అభిమానులకు కనుల పండుగలా ఉంటుంది.ఇదిలావుంటే తాజాగా
అలియా భట్ సూపర్ న్యూస్ ని అభిమానులకు తెలిపింది.ఇకపోతే ఫ్యాన్స్ కి ఈ న్యూస్ షాక్ తో పాటు సర్
ప్రైజ్ కూడా అనే చెప్పాలి.అయితే త్వరలో
అలియా భట్ తల్లి కాబోతోంది. ఇక మీరు విన్నది నిజమే....అలియా, రణబీర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు.ఇకపోతే
అలియా భట్ ఈ శుభవార్తని
ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. కాగా ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి
అలియా భట్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పోతే చెకప్ చేయించుకున్న తర్వాత హాస్పిటల్ బెడ్ పై నుంచి
అలియా ఈ న్యూస్ ఫ్యాన్స్ కి తెలియజేసింది.
అయితే హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్ ని కూడా పంచుకుంది. ఇక
అలియా పక్కనే ఆమె
భర్త రణబీర్ కపూర్ కూడా ఉన్నాడు.అయితే ఆసుపత్రి బెడ్ పై
అలియా చిరునవ్వులు చిందిస్తూ, సిగ్గు పడుతూ కనిపించింది. అంతేకాకుండా ఈ పిక్ తో పాటు ఆడసింహం, మగ సింహం తమ బేబీ సింహంతో ఉన్న క్యూట్ ఫోటో కూడా
అలియా షేర్ చేసింది.ఇకపోతే ఈ న్యూస్ తెలియగానే స్టార్ సెలెబ్రిటీలంతా
అలియా భట్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు. అంతేకాదు
ప్రియాంక చోప్రా,
రకుల్ ప్రీత్ సింగ్,
రాశి ఖన్నా, డయానా పెంటీ,
కరణ్ జోహార్, మౌనిరాయ్,
టైగర్ ష్రాఫ్ లాంటి ప్రముఖులంతా
అలియా, రణబీర్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు..!!