ఫోటోలో ఉన్న అబ్బాయి పై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్..!!

Divya
టాక్సీవాలా చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియాంక జవాల్కర్ ఆ తర్వాత వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఆ తరువాత తిమ్మరుసు, గమనం వంటి చిత్రాలలో నటించి బాగా ఆకట్టుకుంది. ఒకవైపు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింటే చాలా వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఫోటో విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

ప్రియాంక జవాల్కర్ షేర్ చేసిన ఫోటోలు ఒక అబ్బాయి ముఖం కనిపించకపోవడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఆ అబ్బాయి క్రికెటర్ అంటూ కూడా పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఎట్టకేలకు ఈ రూమర్స్ పై స్పందించింది ప్రియాంక జవాల్కర్. తన షేర్ చేసిన ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు అనే విషయాన్ని తెలియ జేయడం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఫోటో సెక్షన్  పనుల్లో మాకు సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి అని తెలియజేసింది.
తన బాయ్ ఫ్రెండ్ అంటూ వస్తున్న వార్తలపై తన తల్లి అడుగుతోందని..ప్రియాంక జవాల్కర్ తెలియజేసింది. ఇకపై ఈ విషయం గురించి మాట్లాడడం మానేస్తే బాగుంటుంది అని తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఇవ్వడం జరిగింది. మొత్తానికి తన ప్రేమ అయిన పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది అని చెప్పవచ్చు ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. సినిమాలలో కూడా చాలా నెమ్మదిగా నే నటిస్తూ ఉన్నది. తన రాబోయే సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈమె పోస్ట్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: