తెలుగు
సినిమా ఇండస్ట్రీలో
మాస్ హీరోలలో ఒకరు అయిన గోపీచంద్ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన సిటిమర్ సినిమాతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకని ఫుల్
జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. సీటి మార్
సినిమా విజయంతో ఫుల్
జోష్ లో ఉన్న గోపీచంద్ ప్రస్తుతం
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరైన
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్
మూవీ లో హీరోగా నటించాడు.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన
రాశి కన్నా
హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ
సినిమా నుండి విడుదల అయిన టీజర్, ట్రైలర్ లలో
రాశి ఖన్నా తన డిఫరెంట్ మేనరిజం డైలాగ్ లతో బాడీ లాంగ్వేజ్ తో నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాలో
రాశి కన్నా అదిరిపోయే రేంజ్ లో జనాలను ఎంటర్టైన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. పక్కా కమర్షియల్
మూవీ లో రావు రమేష్,
సత్యరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే పక్కా కమర్షియల్
మూవీ ని జూలై 1 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ
సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ఈ
సినిమా ప్రమోషన్ లను వేగవంతంగా నిర్వహిస్తోంది.
అందులో భాగంగా ఇప్పటికే ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ ఫంక్షన్ ను చిత్ర బృందం ముగించింది. ఈ ఫంక్షన్ కు
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా పక్కా కమర్షియల్ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ నుండి ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ ను అందుకుంది. అలాగే ఈ
సినిమా రన్ టైమ్ ను కూడా చిత్ర బృందం లాక్ చేసింది. ఈ
సినిమా రన్ టైమ్ ను చిత్ర బృందం 2 గంటల 32 నిమిషాలకు లాక్ చేసింది.