ఇలా ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ నటించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడం తో ఈ ముద్దుగుమ్మకు
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ లభించింది. వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నప్పటికీ
ప్రియాంక జవాల్కర్ కు మాత్రం స్టార్ హీరోల మూవీలలో మాతృ అవకాశాలు దక్కడం లేదు.
మూవీ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న
ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా
ప్రియాంక జవాల్కర్ తన సోషల్
మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో
ప్రియాంక జవాల్కర్ ముందు ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఈ ఫోటోలో ఆ వ్యక్తి మొహం కనిపించకుండా వెనక్కు తిరిగి కూర్చుని ఉన్నాడు.
దానితో
ప్రియాంక జవాల్కర్ ప్రేమ లో ఉంది అని, ప్రియాంక జవాల్కర్ ప్రేమలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు అని అది
యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ అంటూ అనేక కథనాలు బయటకు వచ్చాయి. దీంతో దీనిపై స్పందించిన
ప్రియాంక జవాల్కర్... ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి తమకు వర్క్ లో సహాయం చేసేందుకు వచ్చాడని, తన బాయ్ ఫ్రెండ్ అని వార్తలు వస్తుండటంతో , ఏంటి విషయం అని తన తల్లి అడిగిందని
ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చింది. అలాగే దయచేసి ఇలాంటి వార్తలను రాయవద్దని
ప్రియాంక జవాల్కర్ కోరింది.