బాలీవుడ్
ఇండస్ట్రీ నుండి ప్రతి వారం అనేక సినిమాలు విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో స్టార్ హీరోలు నటించిన సినిమాలు మరియు స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయాలను సాధించడం లేదు.
గత కొద్ది కాలంగా
బాలీవుడ్ స్టార్ హీరోలు , స్టార్ దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ వస్తున్నాయి . అలాంటి సమయం లోనే
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్వశక్తితో ఎదిగి చిన్న
హీరో నుంచి మంచి క్రేజ్ ను సంపాదించుకున్న
కార్తిక్ ఆర్యన్ నటించిన భూల్ భూలయ్యా-2
బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త కళను తీసుకువచ్చింది . మామూలు బడ్జెట్ తో తెరకెక్కి, మామూలు అంచనాలతో
థియేటర్ లలో విడుదల అయ్యి, భారీ
బ్లాక్ బస్టర్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ
సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ కు పూర్వవైభవాన్ని తీసుకువచ్చింది. ఈ సినిమాలో
కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించగా,
కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ లో టబు ఒక కీలకమైన పాత్రలో నటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ
సినిమా ఏప్రిల్ 20 వ తేదీన విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి షో నుండే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర 180 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఈ సినిమాను టి సిరీస్ నిర్మించింది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా కోసం
కార్తిక్ ఆర్యన్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కోసం
కార్తీక్ ఆర్యన్ 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు బి టౌన్ లో ఒక న్యూస్ హల్చల్ అవుతుంది. ఈ సినిమాకు
అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించాడు.