టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన
యువ హీరోలలో ఒకరు అయినా నిఖిల్
సిద్ధార్థ్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన
కార్తికేయ 2 సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నిఖిల్
సిద్ధార్థ్ సరసన అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాకు
కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు.
కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించిన
కార్తికేయ సినిమాకు కార్తికేయ 2
సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. అలా ఇప్పటికే సూపర్ హిట్ అయిన
కార్తికేయ సినిమాకు
కార్తికేయ 2
సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుండడంతో
కార్తికేయ 2 సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ
సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రముఖులు అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా
కార్తికేయ 2 చిత్ర బృందం ఈ
సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ కూడా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ప్రస్తుతం ఈ
సినిమా ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో ఈ
సినిమా తెలుగు
థియేటర్ హక్కులపై కూడా భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ
సినిమా తెలుగు
థియేటర్ హక్కులకు పెద్ద పెద్ద సంస్థల నుండి భారీ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు భారీ సంస్థలు ఈ
మూవీ హక్కులను దక్కించుకోవడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారని, త్వరలోనే అవి అమ్ముడు అయిన తరువాత అఫీషియల్ గా ప్రకటన రానుందని తెలుస్తుంది.
కార్తికేయ 2 సినిమాను జూలై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ
సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.